కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఐటీయూ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు వివిధ వర్గాలకు చెందిన కార్మికులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మద్దతు పలుకుతూ కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. కార్మికులకు న్యాయం చేసి కనీస వేతనాలు అమలు చేసేంతవరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూదవండి: అందాల వారసురాళ్లు.. మనసు దోచిన హీరోయిన్లు