మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు. బుధవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో పాటు పెద్దపెల్లి నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మహిళల సంక్షేమాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా కృషి చేసినట్లు పుట్ట మధు పేర్కొన్నారు. మహిళలు స్వతహాగా అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మహిళా దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి:నల్గొండలో తలదాచుకున్న ఏపీ తెదేపా నేతలు