కార్మికుల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని రామగుండం రీజియన్ జీఎం విజయపాల్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు నెలలో ఆర్జీఎన్ ఏరియాలో 61 శాతం బొగ్గు ఉత్పత్తి చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామన్నారు.
ఇవీ చూడండి : రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు :సీఎం