పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిపో వద్ద కార్మికులకు సంఘీభావంగా మహిళా సంఘాలు దీక్షలో పాల్గొన్నాయి. ఆర్టీసీ కార్మికులు 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మహిళా సంఘాల నాయకులు అన్నారు. బంగారు తెలంగాణ పేరిట ఆర్టీసీ కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : అంబులెన్స్ అందుబాటులో లేక నటి మృతి