పట్టణాల్లో అందుబాటులో ఉన్న తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే మియవాకి విధానంలో రామగుండం ఎన్టీపీసీ సంస్థ ఆదర్శంగా నిలిచిందని వరంగల్ రేంజ్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఎంజే అక్బర్ పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం కాజిపల్లి సమీపంలో చేపట్టిన ఈ మియావాకి విధానం ద్వారా చిట్టడవుల అభివృద్ధి కోసం చేపట్టిన మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు.
4 నెలల్లో మొక్కలు ఎదిగిన తీరును చూసి ఆయన అభినందించారు. తక్కువ స్థలంలో 52 రకాల జాతుల మొక్కలను పెంచి ఆదర్శంగా నిలిచారని రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, జిల్లా అటవీశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జపాన్‌కు చెందిన మియావాకి తరహా పెంపకం ద్వారా.. తక్కువ స్థలంలో ఎక్కువ మొత్తంలో చెట్లను పెంచవచ్చు. తక్కువ సమయంలో చిట్టడవులను సృష్టించవచ్చు. ఈ విధానం అనుసరించే.. ఎన్టీపీసీ అటవీ శాఖ అధికారుల ప్రశంసలు అందుకుంది.
ఇవీ చూడండి: హరీశ్ చేతుల మీదగా ఇళ్ల పట్టాలు పంపిణీ