ETV Bharat / state

సింగరేణి మృతుల కుటుంబాలకు వీహెచ్ పరామర్శ

రామగుండం సింగరేణి ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలను కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకులు వి.హనుమంతరావు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

v.hanumantharao has visited the families of Singareni deaths
సింగరేణి మృతుల కుటుంబాలను పరామర్శించిన వీహెచ్​
author img

By

Published : Jun 4, 2020, 5:11 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి ప్రమాదంలో మృతి చెందిన రాజేశ్​, రాకేశ్​ కుటుంబాలను కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు వి.హనుమంతరావు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

నలుగురు కార్మికులు మృతి చెందితే.. స్థానిక తెరాస మంత్రులు బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించలేదని వీహెచ్​ విమర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు రూ. కోటి పరిహారం ఇవ్వాల్సి ఉండగా.. సింగరేణి యాజమాన్యం రూ. 40 లక్షలు అందించి చేతులు దులపుకుందని పేర్కొన్నారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టులు సందర్శిస్తే.. ప్రభుత్వం తమపై పోలీస్​ కేసులు పెడుతోందని వీహెచ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట మంథని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు, మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఉన్నారు.

ఇదీచూడండి: 40 లక్షల పరిహారం.. కాంట్రాక్టు ఉద్యోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.