ETV Bharat / state

కలెక్టరేట్​లో వాల్మీకి జయంతి, ఏకతా దివస్​ వేడుకలు - పెద్దపల్లి కలెక్టరేట్​లో వాల్మీకి జయంతి

మహాకవి వాల్మీకి జయంతి, జాతీయ ఏకతా దివస్​ను పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్​లో ఘనంగా జరిపారు. వాల్మీకి, సర్దార్​ వల్లభభాయ్​ పటేల్ చిత్రపటాలకు కలెక్టర్​ లక్ష్మీనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు.

valmiki jayanthi celebrations at peddapalli district collector office
కలెక్టరేట్​లో వాల్మీకి జయంతి, ఏకతా దివస్​ వేడుకలు
author img

By

Published : Oct 31, 2020, 3:21 PM IST

మహనీయుల జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్​ లక్ష్మీనారాయణ అన్నారు. మహాకవి వాల్మీకి జయంతి, జాతీయ ఏకతా దివస్​ను పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్​లో వాల్మీకి, సర్దార్​ వల్లభభాయ్​ పటేల్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

సర్దార్​ వల్లభభాయ్​ పటేల్​ కృషి వల్ల 560 సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయని కలెక్టర్​ తెలిపారు. దేశంలో ఉన్న అనేక భిన్నత్వాలను ఐక్యం చేయడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. మహాకవి వాల్మీకి హిందూ ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని.. దాని ద్వారా సమాజానికి అనేక విలువలను అందించారని కలెక్టర్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 20 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులకు రిజిస్ట్రేషన్‌: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.