పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని గుండారం జలాశయం ప్రాంతంలో పులి పాదాల గుర్తులు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 20 రోజులుగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల గుండా పులి ఆవాసం కోసం తిరుగుతున్నట్లు సమాచారం.
ఐదు రోజుల కిందట కలకలం..
గత ఐదు రోజుల కిందట పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలో బగులగుట్ట మీద ఆవులమందపై పులి దాడి చేసింది. కమాన్పూర్ మండల పరిసరాల్లో పులి కాలి ముద్రలు కనిపించడంతో ప్రజల్లో కలకలం రేగింది. ఫలితంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
గాలింపు తీవ్రం...న
పెద్దపులి తన ఆవాసం కోసం వెతుకుతుండగా, అటవీశాఖ అధికారులు వ్యాగ్రం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పులి తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి కాలంలో అనేక ప్రాంతాలను అన్వేషిస్తూ ఉంటుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
అది దొరకగానే మకాం..
అనువైన ప్రదేశం దొరకగానే మకాం పెడుతుందని వివరించారు. వ్యాఘ్రం జాడ కనుక్కునేందుకు అటవీశాఖ అధికారులు ముమ్ముర ప్రయత్నాలు సాగిస్తున్నారు. రోజుకో ప్రాంతంలో సంచరిస్తూ అధికారులకు, ప్రజలకు ఆందోళన చెందుతున్నారు.
స్థానికుల భయోత్పాతం..
పులి అడుగు జాడలు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుండటంతో స్థానికులు భయోత్పాతానికి గురవుతున్నారు.
ఇవీ చూడండి : 'జీరో అవర్లో హీరోగిరి చేస్తానంటే ఎట్లా అధ్యక్షా..!'