ETV Bharat / state

తల్లిని రోడ్డుపై వదిలేసిన కుమారులు.. ఆశ్రయం కల్పించిన పోలీసులు

తొమ్మిది నెలలు మోసి అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకులే కన్నతల్లిని కాదు పొమ్మన్నారు. ముసలితనంలో ఆసరాగా ఉండాల్సింది పోయి నడిరోడ్డుపై వదిలేశారు. అయినా వాళ్లే పట్టించుకోని ఆ వృద్ధురాలికి పోలీసులు అండగా నిలిచారు. మేమున్నామంటూ ఆ అవ్వను చేరదీసి ఆశ్రయం కల్పించారు.

వృద్దురాలికి ఆశ్రయం కల్పించిన పోలీసులు
వృద్దురాలికి ఆశ్రయం కల్పించిన పోలీసులు
author img

By

Published : Apr 28, 2021, 2:46 AM IST

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన రాజమ్మకు నలుగురు కుమారులు. అందులో రెండో కుమారుడు బాపు, చిన్న కుమారుడు సారయ్య మృతి చెందారు. పెద్ద కుమారుడు రాజయ్య సింగరేణి రిటైర్ కార్మికుడు. బేగంపేట ఎక్స్​రోడ్డు వద్ద నివాసముంటున్నాడు. మూడో కుమారుడు శంకర్​ కోరుట్లలో నివాసముంటున్నాడు. కొన్ని రోజులుగా తల్లి రాజమ్మను మీరంటే మీరే చూసుకోవాలంటూ కొడుకులు, కోడళ్లు గొడవలు పెట్టుకుని చివరికి ఆమెను పట్టించుకోవడమే మానేశారు. ఫలితంగా రాజమ్మ ఒంటరిగా గ్రామంలో ఉంటూ ఇబ్బందులు పడుతోంది.

రాజమ్మ కష్టాలను చూడలేక గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నరసింహారావు, మంథని సీఐ మహేందర్​రెడ్డి గ్రామానికి చేరుకుని వృద్ధురాలికి ఆశ్రయం కల్పించారు. రేపు పోలీస్ స్టేషన్​కు రావాలని, సమస్యను పరిష్కరిస్తామని కుమారులు, కోడళ్లకు సూచించారు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌కు కొవిడ్​ పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.