పెద్దపల్లి జిల్లా మంథని ఆర్డీఓ ఆఫీస్ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి ఓ రైతు ఆందోళన చేపట్టాడు. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన కట్ల రమేశ్ 8ఏళ్ల క్రితం రఘోత్తం రెడ్డి దగ్గర భూమి కొనుగోలు చేశాడు. ఇన్ని సంవత్సరాలైనా.. తన పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. మళ్లీ ఇప్పుడు తన భూమిలో రఘోత్తంరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నాడని రెవెన్యూ అధికారుల మొర పెట్టుకున్నా... న్యాయం జరగలేదని సెల్ టవర్ ఎక్కాడు. రమేశ్ కుటుంబ సభ్యులు స్థానిక అంబేద్కర్ చౌక్ ప్రధాన రహదారిపై పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు. స్థానిక ఎస్ఐ పురుగుల మందు డబ్బా లాక్కుకోవడం వల్ల రోడ్డుపై అడ్డంగా పడుకుని నిరసన తెలియజేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.
రమేశ్ టవర్ ఎక్కిన విషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా ఛైర్మన్ పుట్ట మధుకర్ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం వల్ల టవరుపై నుంచి దిగి వచ్చాడు. సుమారు 8 గంటల పాటు రమేశ్ సెల్ టవర్‌పై ఉన్నాడు.
ఇదీ చూడండి : నిద్రావస్థలో తూనికల శాఖ... దోచేస్తున్న వ్యాపార దళం