పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని సంజయ్ గాంధీనగర్లో 200 మంది నిరుపేదలకు ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం మేయర్ అనిల్ కుమార్లు హాజరై పలువురికి సరకులు అందించారు.
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను అభినందించారు. గోదావరిఖనిలోని ఆపిల్ కిడ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ సునిత నిరుపేదలకు ఒక్కొక్కరికి వంద రూపాయల నగదును అందజేశారు. ప్రతి ఒక్కరూ సేవ చేయడం బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చూడండి : 'తేమ, తాలు, మిల్లర్ల సమస్యలున్న మాట వాస్తవమే'