ETV Bharat / state

ఆ గట్టునున్నావా ఓటరన్నా ఈ గట్టునున్నావా - ప్రజానాడి తెలియక అభ్యర్థుల పరేషాన్ - Parties focus on Telangana assembly elections

Telangana Voters Opinion 2023 : తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది.. రాజకీయ పార్టీల్లో గుబులు పుడుతోంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నాయి. వారి మదిలో ఏముందో మాత్రం అంతుచిక్కకపోవడంతో నాయకులు పరేషాన్ అవుతున్నారు.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 12:32 PM IST

Updated : Nov 23, 2023, 12:37 PM IST

Telangana Voters Opinion 2023 : రాష్ట్రంలో చలిగాలులు వీస్తున్నా.. రాజకీయ పరిణామాలు మాత్రం వేడెక్కిస్తున్నాయి. నేతలు గెలుపోటములపై స్పష్టత రాక మల్లగుల్లాలు పడుతున్నారు. ఓటరు అంతరంగం (Telangana Voter Survey) తెలుసుకునేందుకు పోటీపడుతున్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నా లోలోపల ఓటర్ల మనసు గుర్తించలేక అభ్యర్థులు మథనపడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు, అనుచరులు గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు.

Voter Survey in Telangana 2023 : ఉదయాన్నే పల్లెలకు వెళ్లి ప్రచారం చేసినా (Telangana Election Campaign).. రాత్రివేళ ఆ గ్రామంలోని తమ పార్టీ పరిస్థితులపై కూపీ లాగుతున్నారు. ఏ పార్టీ ప్రచారం జరిగినా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. దీంతో వారు ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలుపుతారో తెలియక నేతలు, అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలతోపాటు బీఎస్పీ, కొన్ని నియోజకవర్గాల్లో స్వతంత్రులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఓటరు నాడి అర్థం కాక తికమక పడుతున్నారు.

'మా భవిష్యత్‌కు భరోసా ఇచ్చే నాయకుడికే ఓటేస్తాం'

కలవరపెడుతున్న పార్టీల మార్పు : ఇంకా ఎన్నికలకు వారం రోజులే సమయం ఉంది. ఇప్పటికే ఆయా పార్టీల్లోని నేతలు, అనుచరులు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు మారుతుండటం అభ్యర్థులను కలవరానికి గురి చేస్తుంది. మరోవైపు ప్రచారం కన్నా తమ పార్టీ నుంచి ఎదుటి పక్షంలోకి చేరికలు లేకుండా చూసుకోవడం పైనే ఫోకస్ పెట్టారు. అదేవిధంగా ఎవరన్నా పార్టీ మారితే అవతలి పార్టీ నాయకులు.. తమ వైపు వచ్చేలా దృష్టి పెట్టడానికే ఎక్కువ సమయం సరిపోతోందని అభ్యర్థులు వాపోతున్నారు. మీ వెంటే మేము అంటూ కలిసి తిరిగిన నేతలు, శ్రేణులు మరుసటి రోజే కండువాలు మారుస్తున్నారని అంటున్నారు. దీంతో ఎవరిని నమ్మి వ్యూహాలు పంచుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.

బాబ్బాబు ఒక్కసారి ఊరొచ్చి నాకు ఓటేసిపో - రానుపోను ఖర్చులన్నీ నావే

గత పోలింగ్‌ నివేదికల పరిశీలన : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పోలింగ్‌ బూత్‌లలో ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రస్తుతం ఎన్ని వచ్చే అవకాశాలున్నాయి? గ్రామాల వారీగా తమ ఓటు బ్యాంకు ఎంత? సామాజిక వర్గాల వారీగా మద్దతు ఎలా ఉండవచ్చు.. నేతల పార్టీల మార్పుతో కలిగే నష్టం తదితర అంశాలు నాయకులు, అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు ప్రత్యేకంగా కొందరికి బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ బలంగా ఉన్నాం.. ఎక్కడ బలహీనపడ్డామనే వివరాలు సేకరిస్తూ అందుకనుగుణంగా వారు వ్యూహాలు మార్చుకుంటున్నారు.

ఇలా అయితే నాడి తెలిసేదెలా..! : మరోవైపు బహిరంగ సభలు, రోడ్ షోలకు హాజరైన ప్రజలతో.. నేతలు ప్రత్యేకంగా మాట్లాడిస్తున్నారు. ఏ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుంది? ఏ అభ్యర్థికి ఓట్లు ఎక్కువగా వస్తాయని అడిగితే ఓటర్లు (Telangana Voter Survey) చాలా తెలివిగా సమాధానం ఇస్తున్నారు. ఆ ప్రశ్న అడిగిన వ్యక్తినే.. అతని వ్యక్తిగత, పార్టీ వివరాలు ఆరా తీసి అనంతరం ఆ పార్టీయే గెలుస్తుందని చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో ఓటరు నాడి పట్టుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఎన్నికలకు వారం రోజులే సమయం ఉండటంతో తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి.. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో యువత ఓటే కీలకం

హైదరాబాద్​ షెహర్​పై పట్టు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు - ఓటర్ల మనసు గెలిచేదెవరో? జెండా పాతేదెవరో?

Last Updated : Nov 23, 2023, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.