ETV Bharat / state

కాళేశ్వర ఫలితం.. నిండుకుండలా ప్రాజెక్టులు - కాళేశ్వరం ప్రాజెక్టు వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఫలితంగా పలు ప్రాజెక్టులు జలసిరిని సంతరించుకుంటున్నాయి.

parvathi barrage
parvathi barrage
author img

By

Published : Jun 20, 2021, 4:36 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంప్​ హౌస్​లో ఏడు మోటార్ల ద్వారా పార్వతి బ్యారేజ్​లోని నీటిని ఎత్తిపోస్తున్నారు.

గత నాలుగు రోజులుగా నీటి ఎత్తిపోతల ప్రక్రియ జరుగుతోంది. తొలుత రెండు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి... ప్రవాహం పెరిగే కొద్దీ విడతల వారీగా మూడు, ఐదు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోశారు. ఇవాళ ఏడు మోటార్లను రన్​చేస్తూ.. మొత్తం 14 పైపుల ద్వారా నీటిని పార్వతి బ్యారేజ్​లోకి ఎత్తిపోస్తున్నారు. పార్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.518 టీఎంసీల నీరు నిల్వా ఉంది. ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల నీటిని పార్వతి బ్యారేజ్​లోకి ఎత్తి పోస్తుండడం వల్ల ప్రాజెక్టు నిండుకుండలా మారింది.

నిండుకుండలా మధ్యమానేరు..

మధ్యమానేరులోకి గోదావరి జలాలు భారీగా చేరుతున్నాయి. రోజుకు ఒక టీఎంసీ చొప్పున మద్య మానేరు ప్రాజెక్టులోకి తరలిస్తున్నారు. పార్వతి, నంది పంప్​ హౌస్​ల నుంచి ఇన్​ఫ్లో రావడం వల్ల ఆ మేరకు గాయత్రి పంప్​ హౌస్​ నుంచి నాలుగు బాహుబలి పంపులతో 12,600 క్యూసెక్కుల జలాలను ఎత్తిపోస్తున్నారు. మొదట్లో రెండు బాహుబలి పంపులతో ఎత్తిపోతలు చేపట్టారు. క్రమంగా మరో రెండు బాహుబలి పంపులతో నీటిని ఎత్తిపోశారు.

మరోవైపు మధ్య మానేరు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ జలాశయంలో నీటి నిలువ తగ్గకుండా గాయత్రి పంప్ హౌస్ నుంచి 12,600 క్యూసెక్కుల జలాల ఎత్తిపోతలు చేపడుతున్నారు.

ఇవీచూడండి: Cm Kcr: నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయ్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.