ETV Bharat / state

రామగుండం పవర్​ ప్లాంట్​లో సాంకేతికలోపం

రామగుండం ఎన్టీపీసీ విద్యుత్​ పరిశ్రమలో సాంకేతికలోపం ఏర్పడింది. సుమారు 600 యూనిట్ల విద్యుత్ నిలిచిపోయింది. మరమ్మతు పనులు చేపట్టిన అధికారులు మరో రెండురోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

ఎన్టీపీసీలో నిలిచిపోయిన విద్యుత్
author img

By

Published : Mar 19, 2019, 12:19 PM IST

Updated : Mar 19, 2019, 3:35 PM IST

ఎన్టీపీసీలో నిలిచిపోయిన విద్యుత్
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోసాంకేతిక లోపంతో విద్యుత్ నిలిచిపోయింది. 4వ యూనిట్​లో బాయిలర్​ ట్యూబ్​ లీకేజీతో ఉత్పత్తి నిలిచిపోయింది. లోపాన్ని గుర్తించిన అధికారులు హుటాహుటిన మరమ్మతుపనులు చేపట్టారు. ఈ కారణంగా రెండు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి జరగడంలేదు. మిగిలిన 5యూనిట్లలో 1500 మెగావాట్ల వరకు విద్యుత్ వస్తోందని అధికారులు తెలిపారు.

మరో రెండు రోజులు...

లోపాన్ని సవరించేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వార్షిక లక్ష్యం చేరుకునే దశలో ఈ సమస్య వచ్చింది.

ఇవీ చూడండి:అమల్లోకి తగ్గించిన జీఎస్టీ !

sample description
Last Updated : Mar 19, 2019, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.