ETV Bharat / state

'కాంగ్రెస్​కు పబ్లిసిటీ అవసరం లేదు... ప్రజాసేవే ముఖ్యం'

పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీచర్స్​ డే సందర్బంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీధర్​బాబు నివాళులర్పించారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన కృషి చేశారన్నారు. కరోనా నేపథ్యంలో వ్యాధిగ్రస్థులకు ఆత్మస్థైర్యం కలిగించాలని కాంగ్రెస్​ అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పబ్లిసిటీ అవసరం లేదని ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమన్నారు.

teachers day celebrations at manthani in peddapalli district
'కాంగ్రెస్​కు పబ్లిసిటీ అవసరం లేదు... ప్రజాసేవే ముఖ్యం'
author img

By

Published : Sep 5, 2020, 1:59 PM IST

కాంగ్రెస్ పార్టీకి పబ్లిసిటీ అవసరం లేదని ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మదర్ థెరిసా వర్ధంతి సందర్భంగా థెరిసా చిత్రపటానికి కూడా నివాళులర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా సేవలందించిన అనంతరం రాజకీయ వేత్తగా దేశాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారన్నారు. విద్యార్థులను మంచి పౌరులుగా తయారు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ కరోనా వ్యాధిగ్రస్తులకు ఆత్మస్థైర్యం కలిగించాలని అనేక కార్యక్రమాలను చేపడుతోందని శ్రీధర్​బాబు అన్నారు. అందులో భాగంగా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరోనా వ్యాధిగ్రస్తుల కోసం సేవా కార్యక్రమాలను ప్రారంభించామని... రోగులకు ఎటువంటి సాయం కావాలన్నా కార్యాలయానికి రావొచ్చన్నారు. ప్రభుత్వం సూచించిన మందులను అత్యవసర సమయంలో కరోనా బాధితులకు అందిస్తామన్నారు. కరోనా వ్యాధితో మరణిస్తే అంత్యక్రియలకు అవసరమయ్యే పీపీఈ కిట్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త ప్రజల్లో కొవిడ్​ పట్ల ఉన్న సందేహాలను నివృత్తి చేసి ధైర్యం నింపాలని శ్రీధర్​ బాబు అన్నారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.