కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు ఉద్యోగాలు చేపట్టిన సమ్మె రెండోరోజు చేరుకుంది. ఒకరోజు సమ్మెకు మద్దతు తెలిపిన సింగరేణి గుర్తింపు సంఘం... నేడు సమ్మెలో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో టీబీజీకే అనుబంధ కార్మికులు గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మిగతా కార్మికుల అనుబంధ సంఘాల నాయకులు వీరిని అడ్డుకున్నారు. పోలీసులు జాతీయ కార్మిక సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: కరోనా బాధితుల పర్యవేక్షణకు బుల్లి పరికరం