కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సింగరేణి వైద్యశాలలో మెరుగైన సేవలు అందిస్తామని రామగుండం ఆర్జీ-1 జీఎం నారాయణ వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖలోని సింగరేణి ప్రాంతీయ ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న రొమ్ము క్యాన్సర్ పరీక్షలను సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరపత్రాలను విడుదల చేశారు. సింగరేణి వైద్యులతో పాటు గుర్తింపు సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'రవాణా సంస్థల్లో స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయండి'