పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడ్యాల, రచ్చపల్లిలో సింగరేణి భూనిర్వాసితుల ఆందోళన చేపట్టారు. పదేళ్ల క్రితం తమ భూముల్ని సింగరేణి యాజమాన్యం స్వాధీనం చేసుకొందని నిర్వాసితులు తెలిపారు. వ్యవసాయ భూములకు మాత్రమే నగదు చెల్లించిందన్నారు. అప్పట్లో 2014 వరకు 18 ఏళ్లు నిండిన యవతీయువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు నగదు ఇవ్వలేదని వాపోయారు. 2019 నాటికి మేజర్లాయిన యువతీయువకులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిబంధనలు పాటించకుండా అడ్యాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ను సింగరేణి యాజమాన్యం చేపడుతుందని ఆరోపించారు. నియమాలు పాటించకుండా బొగ్గు తవ్వకాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ప్రజల భద్రతను గాలికొదిలేశారని ఆరోపించారు. మైన్ సేఫ్టీ డీజీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: బస్సులోనుంచి దింపేసి మహిళపై అత్యాచారం