పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 40 వైశ్య కుటుంబాలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు, మామిడి చెట్టుకు కల్యాణం నిర్వహించారు. అర్చక స్వామిలు వ్రత కథను వివరించగా భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. సత్యదేవున్ని అష్టోత్తర నామాలతో పూజించి, ధూపదీప నైవేద్యాలతో నివేదించి ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చూడండి : సామాన్యుడికి పామాయిల్ పోటు