ETV Bharat / state

'డయేరియా అరికట్టేందుకు రోటా వైరస్​ వ్యాక్సిన్​' - rota virus vaccine

రోటా వైరస్​ వ్యాక్సిన్​ వినియోగంపై పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి సిబ్బందికి అవగాహన కల్పించారు. సెప్టెంబరు 6 నుంచి వ్యాక్సిన్​ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.

'చిన్నారుల్లో డయేరియా అరికట్టేందుకు రోటా వైరస్​ వ్యాక్సిన్​'
author img

By

Published : Aug 21, 2019, 10:53 AM IST

రోటా వైరస్ వ్యాక్సిన్​తో చిన్నారుల్లో డయేరియాను అరికట్టవచ్చని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండల పరిషత్ సమావేశ మందిరంలో మంథని, ముత్తారం, రామగిరి మండలాల వైద్య సిబ్బందికి రోటావైరస్ వాక్సిన్ పనితీరుపై శిక్షణ ఇచ్చారు. సెప్టెంబర్ 5న వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 6వారాలు, 10వారాలు, 14వారాల్లో మూడు డోసులుగా ఇవ్వడం ద్వారా డయేరియా భారినపడకుండా ఉంటారని తెలిపారు. ఇప్పటికే ఇమ్యునైజేషన్​ ద్వారా వివిధ టీకాలు, వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు చెప్పారు. 2.5 మిల్లీ లీటర్ల చొప్పున నోటి పక్క భాగంలో వేయాలని... మొదటి రోజు ఏమైనా రియాక్షన్ కనిపిస్తే తదుపరి డోస్​ వేయకూడదని సూచించారు.

'చిన్నారుల్లో డయేరియా అరికట్టేందుకు రోటా వైరస్​ వ్యాక్సిన్​'

ఇదీ చూడండి: గన్నేరువరంలో జలశక్తి అభియాన్ అధికారుల సందర్శన

Intro:రోటా వైరస్ వాక్సిన్ పై అవగాహన.
రోటా వైరస్ వ్యాక్సిన్ వల్ల చిన్నారుల్లో డయేరియా ను అరికట్టవచ్చని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని లోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు మంథని ,ముత్తారం, రామగిరి మండలాల వైద్య సిబ్బందికి రోటావైరస్ వాక్సిన్ పనితీరుపై అవగాహన తో పాటు శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ రోటావైరస్ వాక్సిన్ పై సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు, సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడం జరుగుతుందని అన్నారు.
చిన్నారులు వివిధ వ్యాధుల బారిన పడకుండా ఇప్పటికే ఇమ్యునైజేషన్ ద్వారా వివిధ టీకాలు, వ్యాక్సిన్లు అందిస్తున్నామని , కొత్తగా డయేరియా నివారణ కోసం రోటా వాక్సిన్ ప్రవేశ పెట్టినట్లు ఆయన వివరించారు. చిన్నారులకు మూడు డోసులు ఇవ్వడం ద్వారా డయేరియా బారినపడకుండా ఉంటారని,6 వారాలు,10 వారాలు,14 వారాల కు మూడు డోసులు ఇవ్వాలని సూచించారు. ఈ డోస్ 2.5 మిల్లీ మీటర్ల చొప్పున నోటి పక్క భాగంలో వెయ్యాలని ముఖ్యంగా సూచించారు. ఈ వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉండదని, కానీ మొదటి రోజు వేసిన క్రమంలో చిన్నారుల్లో ఏమైనా రియాక్షన్ లాంటివి కనిపిస్తే మాత్రం మరొక డోస్ వేయకూడదని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో డి ఐ ఓ కృపా బాయి, డి ఈ ఎం ఓ బాలయ్య , పిహెచ్సి వైద్యాధికారి శంకర దేవి, వివిధ మండలాల వైద్య అధికారులు పాల్గొన్నారు

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.