ETV Bharat / state

రామగుండంలో డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం - పెద్దపల్లి జిల్లా

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్​ పోలీసుల ఆధ్వర్యంలో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

రామగుండంలో డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం
రామగుండంలో డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం
author img

By

Published : Feb 1, 2020, 7:32 PM IST

రామగుండంలో డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం

పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​లో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఆటో, టాక్సీ డ్రైవర్​లకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ రామ్ రెడ్డి ప్రారంభించారు. డ్రైవర్స్ శ్రేయస్సు కోసం, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో డ్రైవర్స్​కు ప్రమాదాల నివారణపై రామ్​ రెడ్డి పలు సూచనలు చేశారు.మనం డ్రైవింగ్​ చేసేటప్పుడు వాహనంలో ప్రయాణికుల ప్రాణాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. డ్రైవర్లకు ప్రముఖ నేత్ర, దంత వైద్య నిపుణులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

ఇవీ చూడండి: 'రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన ఉంటే మేలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.