సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా వంద శాతం రాయితీతో చేప పిల్లల సరఫరా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్దనున్న పార్వతి బ్యారేజీలో చేపపిల్లలను వదిలిపెట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ గోదారమ్మకు పసుపు కుంకుమలు, పూలు సమర్పించారు. 2019-2020లో మొత్తం చెరువులు, రిజర్వాయర్లలో కోటి 86 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా సుందిళ్ల ప్రాజెక్టులో 12 లక్షల చేపపిల్లలు, రెండు లక్షల రొయ్య పిల్లలను వదలనున్నారు. ముదిరాజ్ మత్స్యకారులకు ప్రమాద బీమా వస్తుందని ఛైర్మన్ అన్నారు. ముందు ముందు మత్స్యకారులు అమ్ముకోవడానికి మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చదవండిః బ్యాడ్‌బాయ్ జోరు... రికార్డుల హోరు..!