పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కార్యాలయం సమీపంలో బి-గెస్ట్‌హౌజ్ వద్ద రాజీవ్ రహదారిపై కర్రలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రాకపోకలకు తీవ్ర అంతరయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్‌బాబు వెంటనే స్పందించారు.
సుమారు 20 మంది ట్రాఫిక్ సిబ్బందితో రోడ్డుపై అడ్డంగా పడిన కర్రలను తొలగించారు. రాకపోకలు సజావుగా సాగాయి. ట్రాఫిక్ పోలీసులు జరిమానాలే విధించటమే కాదు.. ప్రజలకు సేవా చేయటంలో తమకంటూ ప్రత్యేకత చాటుకున్నారు.
ఇవీ చూడండి: ఆ విద్యార్థులు మారణాయుధాలతో మాట్లాడుకున్నారు!