రాష్ట్రంలో అనార్యోగంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజవర్గానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 8లక్షల 5వేల చెక్కులను ఎమ్మెల్యే చందర్ అందజేశారు.
సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని చందర్ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలోను పథకాలను కొనసాగిస్తూ ప్రజలపై తనకున్న అభిమానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాటుకుంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని అనారోగ్య బాధితులకు రూ. 3 కోట్ల వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ప్రజా సేవే పరమావధిగా భావిస్తూ.. ప్రజలకు అండగా, ఆసరాగా నిలుస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భార్గవరామ్ బడిలోనే పథక రచన!