ప్రజల వద్దకే పాలన, ప్రజాసమస్యల సత్వర పరిష్కారం పల్లెనిద్ర ప్రధాన లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. రాత్రి ముర్మూర్ గ్రామంలో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే అంతర్గాం మండంలంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన గొప్పగా సాగుతోందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాల అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని, ప్రజాసమస్యల పరిష్కరమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ అమూల్య నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ గౌస్ పాషా, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కేసీఆర్‌తోనే దక్షిణ తెలంగాణకు అన్యాయం: అఖిలపక్షం