ETV Bharat / state

లాక్​డౌన్ అమలును పరిశీలించిన రామగుండం డీసీపీ - రామగుండం డీసీపీ శరత్ చంద్ర పవార్ తాజా వార్తలు

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించారు రామగుండం డీసీపీ శరత్ చంద్ర పవార్. పట్టణంలో లాక్​డౌన్ పక్కాగా అమలవుతోందని, అనవసరంగా బయటకు వచ్చే వారికి జరిమానాలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ramagundam dcp
లాక్​డౌన్ అమలును పరిశీలించిన రామగుండం డీసీపీ
author img

By

Published : May 19, 2021, 5:12 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించారు రామగుండం డీసీపీ శరత్ చంద్ర పవార్. లాక్​డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి.. వారి పత్రాలను పరిశీలించారు. మొదటి సారి వచ్చిన వారిని వదిలేసి రెండోసారి వచ్చిన వారికి జరిమానాలు విధించారు.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం ఇచ్చిన సడలింపు సమయాన్ని భౌతిక దూరం పాటిస్తూ ఉపయోగించుకోవాలని డీసీపీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అత్యవసరంగా ప్రజలు ఎవరైనా బయటికి రావాలనుకుంటే, ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే కచ్చితంగా ఈ పాస్​ ద్వారానే వెళ్లాలని సూచించారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు కరోనా కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.