లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ వి.సత్యనారాయణ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన 2200 మందిపై 600 కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. సుమారు 3500 వాహనాలు సీజ్ చేశామన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించామన్నారు. విదేశాల నుంచి వచ్చిన 90 శాతం మందిని స్వీయ గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు.
రామగుండం కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి, నంది మేడారం, సుల్తానాబాద్‌లో హౌస్ ఎలివేషన్ కేంద్రాల్లో 120 మంది ఉన్నారన్నారు. నిత్యవసర వస్తువులు, ఇతర అత్యవసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీచూడండి: వాడిపోతున్న పూలు.. విలపిస్తున్న రైతులు