మహాశివరాత్రిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ సత్యనారాయణ... వేలాల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం బందోబస్త్ ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. మల్లన్న దర్శనం చేసుకున్న భక్తులు ఆధ్యాత్మిక అనుభూతితో... ఆనందంగా ఇంటికెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వాహనాల రద్దీ పెరిగితే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని సీపీ సూచించారు. ఆయన వెంట జైపూర్ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సీఐ కోటేశ్వర్, చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం.. అభిషేకాలతో తన్మయత్వం