కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉద్యమ బాటలో ఉన్న మావోయిస్టులందరూ అడవిని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని రామగుండం సీపీ సత్యనారాయణ కోరారు. జిల్లా కేంద్రానికి చెందిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఏళ్ల తరబడి ఉద్యమ బాటలో ఉన్న కుమారుడిని జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేలా కృషి చేయాలని సీపీ.. వేణుగోపాల్ రావు తల్లికి విజ్ఞప్తి చేశారు. అడవుల్లో కరోనా బారిన పడి ఎంతో మంది మావోలు ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. ఆమెకు పండ్లు, దుస్తులను అందజేశారు.
వేణుగోపాల్ 40 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి కోసమైన ఆయన తిరిగి రావాలి. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరి భూషణ్.. కరోనా బారిన పడి మృతి చెందారు. పరిస్థితులను అర్ధం చేసుకుని మావోయిస్టులందరూ జనజీవన స్రవంతిలోకి రావాలి. ఆహ్వనించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
- సత్యనారాయణ, రామగుండం సీపీ
ఇదీ చదవండి: ఊరంతా పాములు- వాటితోనే పిల్లల ఆటలు