పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ తొలి బడ్జెట్ సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. పాలకవర్గం 2020-21 సంవత్సరానికి రూ.298.84 కోట్ల బడ్జెట్ ఆమోదించింది.
2020-21 బడ్జెట్ అంచనా వ్యయ నివేదికలు సక్రమంగా లేవంటూ నగర మేయర్ అనిల్ కుమార్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. ప్రతి విషయంలో అడ్డుకోవడం సరికాదంటూ తెరాస కార్పొరేటర్లు మండిపడ్డారు.
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జోక్యం చేసుకుని బడ్జెట్ అంచనాలు సరిగ్గానే ఉన్నాయని సర్దిచెప్పారు. కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల సలహాలు, సూచనలు స్వీకరించి కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : 'కొడుకును సీఎంను చేయడానికే కేసీఆర్ యాగాలు'