ETV Bharat / state

సుందిళ్ల బ్యారేజీ గేట్ల వద్ద కొట్టుకుపోయిన రాఫ్ట్‌బ్లాక్‌లు - Kaleshwaram news

పార్వతి (సుందిళ్ల) బ్యారేజీ గేట్ల వద్ద నీటి ప్రవాహం ధాటికి రాఫ్ట్‌బ్లాక్‌లు కొట్టుకుపోతున్నాయి. వరదలు వచ్చిన సందర్భంలో ఒకేసారి గేట్లను ఎత్తినప్పుడు రాఫ్ట్‌బ్లాక్‌లు పెచ్చులూడి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

raft-blocks-are-flushed-in-water-at-sundilla-barrage-in-peddapalli-district
సుందిళ్ల బ్యారేజీ గేట్ల వద్ద కొట్టుకుపోయిన రాఫ్ట్‌బ్లాక్‌లు
author img

By

Published : Dec 8, 2019, 9:40 AM IST

నీటి ప్రవాహం ధాటికి కాళేశ్వరం ప్రాజెక్టులోని పార్వతి (సుందిళ్ల) బ్యారేజీ గేట్ల వద్ద ఉండే రాఫ్ట్‌బ్లాక్‌లు, సిమెంట్‌ స్లాబ్‌, కాంక్రీట్‌ దిమ్మెలు కొట్టుకుపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని పార్వతి బ్యారేజీ మొత్తం 74 గేట్లతో 15 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవుతో ఆనకట్టను నిర్మించారు. ఒక్కో గేటు వద్ద మూడు మీటర్ల లోతులో కాంక్రీట్‌తో స్లాబ్‌ నిర్మించి, దీనిపై నాలుగు అడుగుల మేర సిమెంట్‌ రాఫ్ట్‌బ్లాక్‌లు ఏర్పాటు చేశారు.

సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో వరదలు వచ్చిన సందర్భంలో ఒకేసారి గేట్లను ఎత్తినప్పుడు రాఫ్ట్‌బ్లాక్‌లు పెచ్చులూడి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టులోని 6 గేట్ల వద్ద ఇదే పరిస్థితి ఉంది. గేట్ల వద్ద రాప్ట్‌బ్లాక్‌లు శిథిలమైతే ఎలాంటి నష్టం జరగదని చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒక్కోసారి నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే ఇలా అవుతుందని చెప్పారు. పెచ్చులుడి శిథిలమవుతున్న వాటిని పరిశీలించి మరమ్మతులు చేపడతామని వివరించారు.

సుందిళ్ల బ్యారేజీ గేట్ల వద్ద కొట్టుకుపోయిన రాఫ్ట్‌బ్లాక్‌లు

ఇవీ చూడండి: ఆదివాసీల హక్కులు రక్షించేందుకు దిల్లీలో బహిరంగ సభ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.