ETV Bharat / state

తెలంగాణకు ప్రధాని మోదీ.. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు - Prime Minister Modi coming to Telangana

Prime Minister public Meeting in Ramagundam: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 12న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. ఈ సభకు కనీవినీ ఎరగని రీతిలో భారీగా జన సమీకరణ చేసేందుకు సిద్ధమైంది. కనీసం లక్ష మందికి తగ్గకుండా బహిరంగ సభను విజయవంతం చేయాలని భావిస్తోంది.

minister
తెలంగాణకు ప్రధాని మోదీ.. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
author img

By

Published : Nov 5, 2022, 8:25 PM IST

Prime Minister public Meeting in Ramagundam: ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, జన సమీకరణపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని సభకు భారీ ఎత్తున రైతులను తరలించాలని బండి సంజయ్‌ తెలిపారు. అయా జిల్లా నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రధానికి భారీ స్వాగతం పలికేలా తెలంగాణ అంతలా వివిధ రూపాల్లో అలంకరణ చేయాలని.. అన్ని నియోజకవర్గాల రైతులు కార్యకర్తలు తరలివచ్చేలా ర్యాలీలు నిర్వహించాలని సంజయ్‌ పేర్కొన్నారు. ప్రధానంగా 6120 కోట్ల వ్యయంతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరించడం వల్ల రైతులకు కలిగే ప్రయోజాలను వివరించాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్దరణ ద్వారా తెలంగాణ, ఏపీ సహా దక్షిణ భారత రైతులందరికీ కొరత లేకుండా ఎరువులను సరఫరా చేయబోతున్నారని అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ సమావేశానికి బండి సంజయ్​తో పాటు ఎంపీ సోయం బాబూరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జి.వివేక్, మాజీ మంత్రులు జి.విజయరామారావు, సుద్దాల దేవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.