ETV Bharat / state

PipeLine : సరస్వతి పంప్​హౌస్ వద్ద పైకి తేలిన పైపులైన్ - pipeline got out of earth at saraswathi pump house

కాళేశ్వరం బ్యారేజీలో భాగంగా నిర్మించిన సరస్వతి పంప్ హౌస్ వద్ద పైపులైన్(PipeLine) పైకి తేలింది. ప్రాజెక్టులోకి భారీ వరద చేరడం వల్లే ఇలా జరిగిందని అధికారులు భావిస్తుండగా.. నాణ్యత లోపమే కారణమని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సరస్వతి పంప్​హౌస్ వద్ద పైకి తేలిన పైపులైన్

author img

By

Published : Jul 25, 2021, 12:11 PM IST

కాళేశ్వరం బ్యారేజీలో భాగంగా నిర్మించిన సరస్వతి పంప్‌ హౌస్‌ వద్ద పైపులైన్‌(PipeLine) పైకి తేలింది. అన్నారం నుంచి నీటిని పార్వతీ బ్యారేజీలోకి ఎత్తిపోయడానికి పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద ఈ పంప్‌హౌస్‌ నిర్మించారు. 12 మోటర్లకు గాను 24 లైన్ల చొప్పున భూమిలో నుంచి పైపులైన్లు వేశారు. ఈ పైపులు దాదాపు 10 నుంచి 15 ఫీట్ల ఎత్తుగల వ్యాసార్థం కలిగి ఉన్నాయి. ఇవి పంప్‌హౌస్ నుంచి బ్యారేజీ వరకు మధ్యలో సగం వరకు ఒక పైపు లైన్ అకస్మాత్తుగా మట్టితో సహా బయటకు వచ్చాయి. ఐతే గత నెలలో ఒకసారి బ్యారేజ్ వద్ద పైపు పైకి రాగా.. గుత్తేదారు సంస్థ అధికారులు మట్టి పోసి కప్పిఉంచారు.

పైకి తేలిన పైపులైన్
పైకి తేలిన పైపులైన్

రెండు రోజులుగా ప్రాజెక్టు నుంచి భారీగా వస్తున్న నీటి వల్లే పైపులు(PipeLine) పైకి తేలాయని అధికారులు భావిస్తున్నారు. పైపులు తేలిన ప్రాంతంలో మట్టి కుంగిపోయింది. అడుగు భాగంలో నీరు చేరి భారీగా నీరు పైకి వెదజల్లుతోంది. మోటార్లు నడవకపోయినా.. పైపులైన్ వాడకపోయినా.. పైపులు పైకి తేలడం పట్ల రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపమే కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా.. ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ.. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.