మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా మంథనిలోని గౌతమేశ్వర దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. తీరంలోని ఇసుకలో సైకత లింగాలను ఏర్పాటు చేసుకున్న మహిళా భక్తులు గోదావరమ్మకు పసుపు కుంకుమను సమర్పించారు.
శివరాత్రి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు మంథని పట్టణంలోని బిక్షేశ్వర, ఓంకారేశ్వర, శీలేశ్వర, సిద్దేశ్వర, సురా బాండేశ్వర స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలను ఆచరించడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి