పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్గా పుట్ట మధుకర్, వైస్ ఛైర్మన్గా మండిగ రేణుకలు ఎన్నికయ్యారు. జిల్లాలో మొత్తం 13 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 11 సీట్లను తెరాస పార్టీ గెలుచుకుంది. మిగతా రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈరోజు పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో పుట్ట మధుకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలిచిన వారికి కలెక్టర్ దేవసేన ఎన్నిక పత్రాలను అందజేశారు. జడ్పీ ఛైర్ పర్సన్గా ఎన్నికైన తాను జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పుట్ట మధు వెల్లడించారు.
ఇవీ చూడండి: 32 జడ్పీ స్థానాల్లో జెండా ఎగురవేసిన తెరాస