ETV Bharat / state

ఉపాధి పనులను పరిశీలించిన కలెక్టర్ - పెద్దపల్లి న్యూస్

పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్​ మండలంలో ఉపాధి పనులను జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గుండారం గ్రామంలో పర్యటించారు. రానున్న వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులు రాకుండా.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు సూచించారు.

Peddapalli Collector Visits Gundaram Village
ఉపాధి పనులను పరిశీలించిన కలెక్టర్
author img

By

Published : May 29, 2020, 2:22 PM IST

పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్​ మండలంలోని గుండాల గ్రామంలో జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఎండలో పని చేస్తున్న ఉపాధి కూలీలతో ముచ్చటించారు. ఎండలు అధికంగా ఉన్నందున.. ఉదయాన్నే పనికి వచ్చి.. ఎండ ఎక్కువ కాకముందే ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. ఉపాధి హామీ డబ్బులు సమయానికి వస్తున్నాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గుండారం రిజర్వాయర్​ లీకేజీ పనులను పరిశీలించారు. జూన్​1 నుంచి 8 వరకు శానిటైజేషన్​ స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించనున్నట్టు తెలిపారు. రానున్న వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులు రాకుండా ప్రజలు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చదనం కసం గ్రామంలో చెట్లు పెంచాలన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 9 వరకే ఉపాధి కూలీలతో పనులు చేయించాలని ఉపాధి హామీ అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్​ కోసం మళ్లీ ప్లాస్మా దానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.