పెద్దపల్లి కలెక్టర్గా సిక్తా పట్నాయక్ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్గా పనిచేసిన సిక్తాను ప్రభుత్వం ఆదివారం రాత్రి పెద్దపెల్లి జిల్లా పాలనాధికారిగా నియమించింది. సోమవారం మధ్యాహ్నానానికి పెద్దపల్లికి చేరుకుని పదవీ బాధ్యతలు స్వీకరించారు.
పెద్దపల్లి కలెక్టర్గా ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య తాను వారధిగా పని చేస్తానని సిక్తా పేర్కొన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తానన్నారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి కలెక్టర్గా ఇదివరకు పనిచేసిన శ్రీ దేవసేన.. ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారిగా బదిలీ అయ్యారు.
ఇవీ చూడండి: పేద పిల్లలనే జాలి లేకుండా తింటుంటే వెళ్లగొట్టాడు!