ETV Bharat / state

నేరస్థులకు వారధి.. పార్వతి బ్యారేజీ

పెద్దపల్లి జిల్లా సిరిపురం వద్ద గోదావరి నదిపై నిర్మించిన పార్వతి బ్యారేజీ నేరస్థులు పారిపోయేందుకు వారధిగా తయారైంది. దాని పరిధిలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఎక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడం వల్ల అక్రమార్కులకు ఈ వారధి ఒక వరంగా మారింది. తాజాగా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది దంపతులను నడిరోడ్డుపై హత్య చేసి అనంతరం కారులో ఈ పార్వతి బ్యారేజీ మీదుగా పారిపోయారు.

Parvati Barrage
నేరస్థులకు రాచమార్గంలా మారిన పార్వతి బ్యారేజీ
author img

By

Published : Apr 4, 2021, 4:32 PM IST

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద గోదావరి నదిపై పార్వతి బ్యారేజీ నిర్మించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాల మధ్య ప్రజలు రాకపోకలను సాగిస్తున్నారు.పెద్దపల్లి-మంచిర్యాల జిల్లాలను కలిపే వంతెన నేరస్థులు, హంతకులు, అసాంఘిక శక్తులు పారిపోయేందుకు వారధిగా తయారైంది. వంతెనపై, దాని పరిధిలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఎక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడం వల్ల అక్రమార్కులకు ఈ వారధి ఒక వరంగా మారింది. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన వంతెన నేడు నేరస్థులు తప్పించుకునేందుకు రాచమార్గం అయింది. ఈ బ్యారేజీ నుంచి పెద్దపెల్లి జిల్లా గుంజపడుగు, సిరిపురం నుంచి మంచిర్యాల జిల్లా జైపూర్, చెన్నూర్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే దూరం తగ్గింది.

హత్యచేసి బ్యారేజీ మీదుగానే..

రెండు నెలల కింద రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది దంపతులను నడిరోడ్డుపై హత్య చేసి అనంతరం కారులో ఈ పార్వతి బ్యారేజీ మీదుగా పారిపోయారు. వీరు పారిపోతూ హత్యకు వాడిన కత్తులను ఈ బ్యారేజీలోనే పడవేసి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయారు. గత నెల మార్చి 24న గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా దొంగలు జాగ్రత్తలు తీసుకొని, 3.10 కోట్ల సొత్తును అపహరించి ఈ మార్గం గుండానే పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులు రెండు రోజుల క్రితం దొంగల ముఠాను పట్టుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులకు ఈ బ్యారేజీ మీదుగా దొంగలు వెళ్లినట్లు అనుమానాలకు బలం చేకూరినట్లయింది.

దొంగలకు రాజమార్గంగా..

మార్చి 26న ఇదే గ్రామం గుంజపడుగులో చైన్ స్నాచింగ్ జరిగింది. గుంజపడుగు గ్రామానికి చెందిన ఓ మహిళ వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కుని, దొంగ పార్వతి బ్యారేజీ మీదుగా పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.అసాంఘిక శక్తులు తప్పించుకునేందుకు ఈ వంతెన సులువైన రాజమార్గంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా సేకరించిన సబ్సిడీ బియ్యం కూడా ఇదే రహదారి గుండా మహారాష్ట్రకు అక్రమంగా రవాణా జరుగుతున్న సమయంలో పోలీసులు మాటు వేసి పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు.

సీసీ కెమెరాలు లేకపోవడం వల్లే..

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని చెబుతుండగా, పార్వతీ బ్యారేజీపై వెళ్లే వాహనాలను గుర్తించేందుకు ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయాన్ని గుర్తించిన అక్రమార్కులు తప్పించుకునేందుకు ఇదే రాజమార్గం గా భావిస్తున్నారు. గోదావరిఖని ప్రధాన రహదారిలో, సిరిపురం బ్యారేజ్ వైపు వెళ్లే మార్గంలో కూడా సీసీ కెమెరాలు లేకపోవడం నేరస్థులకు అనువుగా మారింది. వరుసగా సంఘటనలు జరుగుతున్నా పోలీసులు మాత్రం వంతెనపై సీసీ కెమెరాలు, చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: అమ్మో పురుగులు... వంతెన దాటాలంటే వెన్నులో వణుకే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.