పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ దేవసేన ప్రారంభించారు. సొంత ఖర్చులతో 5 ఎకరాల భూమిని చదును చేసుకొని ఐకేపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న రైతులను కలెక్టర్ అభినందించారు. రైతులంతా కేంద్రానికి ఒకేసారి ధాన్యాన్ని తీసుకురావద్దని... రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు కేటాయించిన షెడ్యూల్ ప్రకారమే రావాలని సూచించారు. తేమ శాతం 17 ఉంటేనే ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు వీలుంటుందన్నారు. జిల్లాలో 215 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవకతవకలు జరగకుండా విజిలెన్స్ అధికారులను నియమించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మెన్ పుట్ట మధుకర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు