పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వృద్ధురాలిపై బంధువులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు మృతిచెందింది. ఇందిరానగర్లో నివాసముండే చల్ల మల్లమ్మ అనే వృద్ధురాలిపై మల్లమ్మ అన్న కూతురు మౌనిక, కోడలు స్వప్న కర్రలతో దాడి చేసి చితకబాదారు.
దెబ్బలు తాళలేకే !
దెబ్బలకు తట్టుకోలేకపోయిన 65 ఏళ్ల మల్లమ్మ మరణించింది. సోమవారం రాత్రి మౌనిక, స్వప్నను తిట్టిందన్న కోపంతో మల్లమ్మపై దాడికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. ఘటనా స్థలాన్ని గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రాజ్ కుమార్ పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి : వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పలువురు అరెస్టు