మధ్యప్రదేశ్లో అమలు చేసిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్.. తెలంగాణలో వెంటనే అమలు చేయాలని నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కోర్టులో వాదనలు వినిపించడమే న్యాయవాద వృత్తని.. పిల్ దాఖలు చేసినందుకే హత్యలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
పెద్దపల్లి జిల్లా గుంజపడుగులో వామన్ రావు-నాగమణిల కుటుంబాన్ని న్యాయవాదులతో కలిసి పరామర్శించారు. వారి హత్యను ఖండిస్తూ మంథని కోర్టు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు.
ఈ రోజు కేసులు వేసిన న్యాయవాదులను హత్య చేస్తే.. భవిష్యత్లో తీర్పు ఇచ్చిన వారి పరిస్థితేంటని ప్రశ్నించారు. హత్యల వెనుక ఉన్న నిజాలు బయటపడాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని స్పష్టం చేశారు. వామన్ రావు-నాగమణిల కుటుంబానికి 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులకు కస్టడీ