పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రార్థనలు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీధర్ బాబును శాలువాతో సత్కరించారు.
క్రిస్మస్ సందర్భంగా మంథనిలోని బేతెల్ చర్చిలో క్రైస్తవులతో కలిసి ఎమ్మెల్యే ప్రార్థనలు చేశారు. కేక్‌కట్ చేసి చిన్నపిల్లలకు తినిపించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో చిరకాలం ఉండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి : ముక్కోటి వైభవం.. భక్తుల తన్మయత్వం..