రామగుండాన్ని కాలుష్య రహితంగా మార్చడంతో పాటు గ్రీన్ హబ్‌గా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక కార్యాలయ ఆవరణలో నూతనంగా కొనుగోలు చేసిన రెండు వాటర్ ట్యాంకర్స్, మూడు స్వీపింగ్ మిషన్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
రామగుండం కార్పోరేషన్లో ఎలాంటి అవినీతికి తావులేకుండా టెండర్ల విషయంలో పగడ్బంధీగా వ్యవహరిస్తున్నామన్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా ఒక ప్రణాళిక బద్దంగా పాలన సాగిస్తున్నామని చెప్పారు. హరితహారంలో భాగంగా ఎన్నో మెక్కలు నాటామన్నారు. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిమీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డా.బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కమిషనర్ ఉదయ్ కుమార్, కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.