ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహానాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 70 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ ను ఎమ్మెల్యే అందించారు.
గత ప్రభుత్వాలు దివ్యాంగుల (Handicapped) సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.300 ఉన్న పింఛన్‌ను రూ.3 వేలకు పెంచి వారు గౌరవంగా జీవించేలా కేసీఆర్ తోడ్పాటు అందిస్తున్నారన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో సంక్షేమశాఖ దివ్యాంగులకు గొప్పగా సహకారం అందిస్తుందన్నారు. వివాహాలు చేసుకున్న దివ్యాంగులకు కల్యాణలక్ష్మి పథకంతో పాటు ప్రభుత్వ పరంగా రూ.1లక్ష ప్రోత్సాహకం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, కొమ్ము వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.