రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన పురపాలక చట్టం నిబంధనలను పాలకవర్గ సభ్యులు పాటించి.. పెద్దపల్లి పురపాలిక ఆదాయ వనరులను పెంచాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరారు. పెద్దపల్లి పురపాలిక కార్యాలయంలో పాలకవర్గ సభ్యులతో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు.
నూతన పురపాలక చట్టంలో ఉన్న నియమ నిబంధనలను పాటిస్తే.. పట్టణాన్ని వేగంగా అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం సభ్యులు అక్రమ లేఅవుట్ల నిర్వహణకు అనుమతులు ఇవ్వకూడదని సూచించారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!