తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 59 మందికి 58 లక్షల 81వేల 844 రూపాయల షాదీముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చందర్ అందజేశారు.
ఉమ్మడి రామగుండం మండలానికి చెందిన 28 మందికి రూ.8,98,500 చెక్కులతో పాటు 1 లక్ష ఎల్.ఓ.సి చెక్కును అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. నిరుపేదల కన్నీళ్లు తుడుస్తున్న మనసున్న మారాజు కేసీఆర్ అని అన్నారు. అనారోగ్య బాధితులకు వరంగా సీఎం ఆర్ ఎఫ్ పధకం నిలుస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కరోనా పాజిటివ్