వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పెద్దపెల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో ప్రచారం చేశారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి... ఓటర్లను ఓటు వేయాలని అభ్యర్థించారు.
తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత మూతపడ్డ ఎరువుల కర్మాగారంతో పాటు రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ ప్రాజెక్టు పేరుతో అదనపు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువత కోసం సింగరేణిలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని... త్వరలో వైద్య కళాశాల నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.