పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను ప్రత్యేక వాహనంలో వారి స్వస్థలాలకు పంపించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి వారిని తరలించారు. మరి కొంత మందిని రైలులో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో అధికారులు తరలింపులు చేపట్టారు. కూలీలు వెళ్లిపోవడంతో ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్లో పనులకు కొంతమేర విఘాతం కలిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్టు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. వలస కూలీల విజ్ఞప్తుల మేరకు వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వలస కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ