పెద్దపల్లి జిల్లా మంథని కూరగాయల మార్కెట్లో విద్యుత్ సౌకర్యం లేదని, వాన కురిస్తే దుకాణాల్లో నీరు నిలుస్తోందని చిరువ్యాపారులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల గురించి పురపాలక కమిషనర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా... ఫలితం లేదని ఇప్పుడున్న కూరగాయల మార్కెట్‌ను మూసివేసి నిరసన తెలిపారు.
మార్కెట్ మూసివేయడం వల్ల ప్రజలు బయట రహదారులపై కూరగాయలు కొంటున్నారు. ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుంటే ఇప్పుడు వారి సమస్యల వల్ల ధరలు మరింత పెరిగాయని సామాన్యులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే మంథనిలో అన్ని సౌకర్యాలతో నూతన కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
- ఇదీ చూడండి : 'పుర ఎన్నికల్లో బలమున్న చోట మేమూ పోటీ చేస్తాం'