పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంథని డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. డివిజన్లోని ఏఈవోలు ఒక్కొక్కరు సాగు విధానాలను, రైతులు పండిస్తున్న పంటల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను, వాటిని ఎలా పరిష్కరించాలనే విషయాలను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. మంథని డివిజన్‌కు సంబంధించి అనేక మంది రైతులకు రైతుబంధు, రైతుబీమా, పీఎం కిసాన్ యోజన కింద లబ్ధి చేకూరలేదని.. లోపాలు ఏమిటని అడిగి తెలుసుకున్నారు.
రైతులకు కావాల్సిన వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతీ రైతు సన్నరకం పంటల్ని సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం.. దానికి తగినట్లుగా మార్కెటింగ్‌ను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. మంథని ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని... దాని వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అధికారులు సూచించగా.. ప్రభుత్వంతో మాట్లాడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతుల సమస్యలను అధికారులు చొరవ తీసుకొని తొలగించాలని శ్రీధర్‌బాబు అధికారులకు సూచించారు. అనంతరం కరోనా వ్యాధి పట్ల అధికారులు జాగ్రత్త ఉండాలని, వారికి మాస్కులను, శానిటైజర్లను శ్రీధర్ బాబు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: కరోనాపై అవగాహన కోసం వినూత్న ఆలోచనలు
రైతుల సమస్యలను అధికారులు పరిష్కరించాలి : శ్రీధర్‌బాబు
ప్రతీ రైతు సన్నరకం పంటల్ని సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం... దానికి తగినట్లుగా మార్కెటింగ్‌ను కూడా ఏర్పాటు చేయాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. మంథని డివిజన్లో వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రైతుల సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.